VZM: పెన్షన్ల పంపిణీని పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు బొబ్బిలి MPDO కార్యాలయంలో ఇవాళ మానిటరింగ్ టీం విధులను ప్రారంభించింది. ఉదయం నుంచే లభ్ధిదారుల వివరాలు, నగదు పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. బయోమెట్రిక్ సాంకేతిక లోపాల పరిష్కారానికి ప్రత్యక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అర్హులందరికీ జాప్యం లేకుండా పెన్షన్ అందేలా చూడటమే లక్ష్యమని వారు తెలిపారు.