MBNR: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కమలాకర్ హెచ్చరించారు. జడ్చర్ల పట్టణవ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ తనిఖీలు చేపడతామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ.. వేడుకలను ఇళ్ల వద్దే ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.