ELR: పోలవరంలో మత్స్యకారులకు బుధవారం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాసులు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఏడాదికి ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని అడిగి తెలుసుకున్నారు.