NRPT: గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్షలో పెద్దజేట్రేం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి జె.మోహన్ ప్రథమ బహుమతి సాధించాడు. దామరగిద్ద పీఎం శ్రీ పాఠశాల విద్యార్థిని పవర్ హారతి ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 135 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.