SDPT: వర్గల్ పరిధి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే దేవత మూర్తులను నాచగిరి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ఉత్తర ద్వారం వద్ద అధిష్ఠింజేసి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా జరిగాయి.