SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనవరి 1నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. ప్రత్యేక తరగతులు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.