ప్రకాశం: త్రిపురాంతకం మండలం గుట్లపల్లి గ్రామంలో బుధవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వాటిని అందజేశారు. కూటమితో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, ఎన్నికల్లో చెప్పినట్లుగానే ప్రతి హామీని నెరవేరుస్తున్నారని సీఎం చంద్రబాబును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.