NZB: నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లికి చెందిన రాజబోయిన పోచవ్వ(68) అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేయగా ఆమెలో కదలిక రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చావుఅంచుల్లోకి వెళ్లి మళ్లీ ప్రాణాలతో తిరిగి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలు మళ్లీ శ్వాస తీసుకోవడంతో బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.