అమెరికాలో ఉంటున్న భారతీయులకు యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలను అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.