ASF: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నితిక పంత్ కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహణ చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై కేక్ కటింగ్లు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.