TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ షాబునగర్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మురికి కాలువలో గర్భస్థ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. గర్భస్థ ఆడశిశువు వయసు సుమారు ఆరునెలలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాలువలు శుభ్రం చేస్తుండగా శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.