BPT: బాపట్ల పట్టణంలో బుధవారం వేకువజాము నుంచి జరుగుతున్న పెన్షన్ పంపిణీని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పరిశీలించారు. పట్టణంలోని పదవ వార్డు ఆచంట రంగనాయకులు నగర్ నందు ఆయన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ నగదును అందజేశారు. బుధవారం నూటికి నూరు శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.