MBNR: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా సోమనాథ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన దేవరకద్ర మండలం గూరకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా,ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యా రంగ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.