GDWL: వైద్యవృత్తి ఉన్నతమైనదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గద్వాల మెడికల్ కళాశాలలో నిర్వహించిన మెడికల్ విద్యార్థుల వైట్ కోట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వైట్ కోట్లు పంపిణీ చేశారు. అనంతరం కళాశాలలో లైబ్రరీ, కంప్యూటర్ సెక్షన్ ప్రారంభించారు. గతంలో వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డామని గద్వాలకు మెడికల్ కాలేజీ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.