SKLM: ధనుర్మాసం పురస్కరించుకుని ఆమదాలవలసలో లక్ష్ముడు పేట, వెంకయ్య పేట గ్రామాల్లో నగర సంకీర్తనలు ఇవాళ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తి గీతాలు, వాయిద్యాల శబ్దాలతో గ్రామ వీధులు మార్మోగుతున్నాయి. శ్రీహరి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.