కృష్ణా: అవనిగడ్డ సబ్-డివిజన్ ప్రజలందరికీ డీఎస్పీ తాళ్లూరి శ్రీ విద్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రజలందరూ బాధ్యతాయుతంగా, క్షేమంగా, సురక్షితంగా, సుఖసంతోషాలతో బంధుమిత్రులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన విజయాలు, సంతోషాలు నింపాలని అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ తరుపున శుభాకాంక్షలు తెలిపారు.