‘దండోరా’ సినిమా ప్రమోషన్స్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ రోజు ఆ స్టేజ్‌పై నవదీప్ కూడా ఉన్నాడు. తాజాగా ఇదే అంశంపై నవదీప్ స్పందించాడు. విద్యార్థులతో నవదీప్ చిట్ చాట్ నిర్వహించగా.. శివాజీ మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఆపలేదు’ అనే ప్రశ్న ఎదురైంది. ఎవరైనా వేదికపై మాట్లాడే సమయంలో ఆపడం కరెక్ట్ కాదని, శివాజీ చాలా సీనియర్ అని బదులిచ్చాడు.