NZB: ఎడపల్లి మండలం జానకంపేటలో మంగళవారం జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. పశు వైద్యశాఖ అధికారి ప్రమోద్ మాట్లాడుతూ.. నట్టల నివారణ వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు పెరుగుతాయన్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ, రాధా, కిషన్ గౌడ్ పాల్గొన్నారు.