NZB: నవీపేట మండలంలోని లింగాపూర్‌కు చెందిన గంధం శ్రీను అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం లింగాపూర్‌లో మండలంలో ని ఆశాజ్యోతి కాలనీకి చెందిన తొంటి హన్మంతుపై గంధం శ్రీను గొడ్డలితో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.