ELR: ఆన్లైన్ చెల్లింపుల్లో పొరపాటున ఇతరులకు బదిలీ అయిన రూ.58,000 నగదును పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఏలూరుకు చెందిన మహిళ పొరపాటున పంపిన రూ.50,000, కైకలూరుకు చెందిన వ్యక్తి బదిలీ చేసిన రూ.8,000ను సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ జి.దాసు, ఎస్సై వల్లి పద్మ సాంకేతిక ఆధారాలతో వెనక్కి రప్పించారు. బాధితులు పోలీసుల సత్వర స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.