AP: కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు. పవిత్రమైన శైవక్షేత్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. ఇది భక్తుల మనోభావాలకు తీవ్రంగా గాయపరిచే చర్య అని పేర్కొన్నారు. ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్, ఎస్పీతో ఆనం ఫోన్లో మాట్లాడారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.