అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్దతిప్పసముద్రం కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, ఏఎన్ఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి నారాయణ సూచించారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.