AP: గుంటూరు జిల్లాలో 394 మంది సచివాలయ సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సచివాలయాల్లో వసూలు చేసిన యూజర్ ఛార్జీలు జమ చేయడంలో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 278 సచివాలయాల పరిధిలో రూ.16.92 లక్షల బకాయిలు ఉన్నాయని, నెలలు గడుస్తున్నా ప్రభుత్వ ఖజానాకు జమ చేయలేదని, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి అధికారులు నోటీసులు అందజేశారు.