AP: పింఛన్దారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా 1న ఇచ్చే ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను ఈసారి కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే ఇవాళ పంపిణీ చేస్తుంది. ఈ నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,743.04 కోట్లను విడుదల చేసింది. గతంలో మాదిరిగానే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును అందజేయనున్నారు.