KMM: ఇంటి ముందు గేదెను కట్టేయొద్దన్నందుకు జరిగిన ఘర్షణ మంగళవారం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. వేంసూర్ (M) రాజుగూడెంలో మార్కపూడి వెంకట్రావు (50), B.వెంకటేశ్వరరావు మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. గుండెసంబంధిత వ్యాధి ఉన్న వెంకట్రావు దాడిలో కుప్పకూలగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.