JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంబోజి గూడెం గ్రామ పరిధిలోని వాగు నుండి ఇసుక తరలింపుకు ఎవరికి అనుమతి ఇవ్వద్దని ఆయా గ్రామాల సర్పంచ్‌లు తహసీల్దార్‌కు మంగళవారం వినతి పత్రం అందించారు. నిర్మల, రామరాజు పల్లి గ్రామాల వారికి ఇసుక తరలింపుకు అనుమతి ఇవ్వగా ట్రాక్టర్లను వెనక్కి తిరిగి పంపించారు. గ్రామసభల అనంతరం గ్రామ ప్రజల నిర్ణయం తీసుకుంటామన్నారు.