కృష్ణా: బాపులపాడు (M) వీరవల్లిలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టును జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం గ్రామ సచివాలయం-2 లో రైతులతో అవగాహన సభనిర్వహించారు. భూముల సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతులందరూ తమ భూమికి సంబంధించిన దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, బ్యాంకు ఖాతా నకళ్లు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తయారు చేసుకొవాలని కోరారు.