WGL: పట్టణంలో ఓ లెక్చరర్ సైబర్ మోసానికి గురై రూ.37,11,536 నష్టపోయారు. ఫేస్బుక్లో స్టాక్ మార్కెట్ లాభాల ప్రకటన నమ్మి లింక్ క్లిక్ చేసిన బాధితుడిని మోసగాళ్లు SBI Securities పేరుతో వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. నకిలీ యాప్ ఇన్స్టాల్ చేయించి 20% లాభాల ఆశ చూపి పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయాలంటే ఫీజు పేరుతో మొత్తం దోచుకున్నారు.