W.G: నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ శ్రీ వేద విజ్ఞప్తి చేశారు. సబ్ డివిజన్ వ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కూడలిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు.