W.G: వేములదీవి పడమర కాపులకొడపలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎ.వాసంతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి, వేదాశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.