AP: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు. రన్వే, ఏటీసీ, టెర్మినల్ భవనాలు తుది దశలో ఉన్నాయి. 2026 మే నుంచి ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.