EG: నర్సరీ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిశారు. నర్సరీ మొక్కలను అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైతుల విన్నపాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.