ఉత్తరాఖండ్ పిప్పల్కోటిలోని జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అంతర్గత రవాణా రైళ్లు ఢీకొని సుమారు 60 మందికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు.