»Earthquake Huge Earthquake In China Tremors In Delhi
Earthquake: చైనాలో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన జిన్జియాంగ్లో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది.
Earthquake: చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన జిన్జియాంగ్లో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. ఈ తీవ్ర భూకంపం ధాటికి భారత రాజధాని న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. రాత్రి 11.39 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్టు వెల్లడించింది. చైనాలో భూకంపం కారణంగా జిన్జియాంగ్ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు.
భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్జియాంగ్ పరిధిలో 27 రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాయవ్య చైనాలో మొత్తం 14 సార్లు భూమి కంపించిందట. వాటి తీవ్రత 3.0 నుంచి అంతకంటే ఎక్కువగా నమోదయిందని పేర్కొన్నాయి. అత్యధికంగా 5.3 తీవ్రత రికార్డయిందని తెలిపాయి. భూకంపం కేంద్రం ఉషు కౌంటీకి సమీపంలో ఉన్నదని వెల్లడించాయి. ఇక కజఖిస్థాన్లో కూడా 6.7 తీవ్రతతో భూమి కంపించిందని అత్యవసర శాఖ ప్రకటించింది.