అన్నమయ్య: ప్రభుత్వం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని DEO సుబ్రమణ్యం సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మంగళవారం డైట్ ఉన్నత పాఠశాలలో దీనిపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.