ADB: సమష్టి కృషితో జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలించవచ్చని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రతి కళాశాలలో పోలీసు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులతో ఆంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై చైతన్యపరచాలని సూచించారు. గంజాయి అలవాటు పడి వారికి D-అడిక్షన్ సెంటర్లలో చేర్పించి చికిత్స అందించాలన్నారు.