»Ncrb Report Revealed That Hyderabad Is On Top In Food Adulteration
Hyderabad : ఆహార కల్తీలో హైదరాబాదే టాప్.. నివేదికలో షాకింగ్ నిజాలు
ఇతరుల ప్రాణాలకు ఏమైతే మాకేంటి.. మా బిజినెస్ బాగా జరిగి మాకు డబ్బులు బాగా వస్తే చాలు.. అనే విధంగా కొందరు స్వార్థపూరిత వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల మొహం చూసైనా కనికరించడం లేదు.
Hyderabad : ఇతరుల ప్రాణాలకు ఏమైతే మాకేంటి.. మా బిజినెస్ బాగా జరిగి మాకు డబ్బులు బాగా వస్తే చాలు.. అనే విధంగా కొందరు స్వార్థపూరిత వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల మొహం చూసైనా కనికరించడం లేదు. అన్నీ కల్తీ చేసేస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాలు నుంచి ముసలి వాళ్ల అవసరాల వరకు ఉపయోగించుకునే వస్తువులన్నీ కల్తీనే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆహార కల్తీలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరానికి, దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి, వాటిలో 246 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ఇందులో 80 శాతం కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇతర నగరాల కంటే హైదరాబాద్ నుంచే ఎక్కువ శాంపిల్స్ సేకరిస్తున్నామని, అందుకే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. అదే నూనె ఎన్ని సార్లు వేడి చేసి వాడుతున్నారో తెలుసుకోవడం కూడా కష్టమని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా 16 మంది మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని చెబుతున్నారు. సాఫ్ట్ గా లేకపోవడం కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉండడానికి కారణం.