»Armor Bjp Mla Paidi Rakesh Reddy Made Serious Allegations Against Jeevan Reddy
Paidi Rakesh Reddy: మగధీరలో హీరోలా అందరినీ చంపి నేను చస్తా!
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు తనకు ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. వారం రోజుల్లోనే విదేశాల నుంచి వందల బెదిరింపు ఫోన్లు వస్తున్నాయన్నారు. తనను చంపడం ఎవరి వల్ల కాదని.. అవసరం అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరిని చంపిన తరువాతే తాను చస్తానన్నారు.
Armor BJP MLA Paidi Rakesh Reddy made serious allegations against Jeevan Reddy
Paidi Rakesh Reddy: ఆర్మూర్(Armor) నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఎలాంటి అక్రమాలు జరగనివ్వనని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి(Paidi Rakesh Reddy) అన్నారు. చీకటి దొంగలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లోనే తనకు వందల బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజులుగా అంతు చూస్తామని, తనను చంపేస్తామని విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనను చంపడం వీళ్ల వల్ల కాదని, పుట్టించిన భగవంతుడికి మాత్రమే సాధ్యమని వివరించారు. అవసరమైతే మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ లా అందరినీ చంపాకే తాను చస్తానని చెప్పారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో సహజసిద్దమైన వనరులను కాపాడుతానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) అక్రమాలు బయటపెడతానని, అక్రమ మైనింగ్ విషయంలో విచారణ జరిపించాలని సీబీఐని కోరామని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే పరిశీలిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పారని పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ విషయంలో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.