»Congress President Mallikarjuna Kharge Has Made Sensational Allegations Against Prime Minister Narendra Modi
Mallikarjuna Kharge: మోడీకి భయం పట్టుకుంది.. అందుకే అలా అంటున్నాడు.
ప్రధాని మోడీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
Congress president Mallikarjuna Kharge has made sensational allegations against Prime Minister Narendra Modi
Mallikarjuna Kharge: ముస్లీంలను వ్యతిరేకిస్తూ హిందువులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటే అని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈమేరకు ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ముస్లింలకు మాత్రమే ఎక్కువగా పిల్లలు ఉన్నారని అంటున్నారు అది తప్పని చెప్పారు. ఆయన తండ్రికి తాను ఒక్కడేనని కానీ తనకు ఐదుగురు పిల్లలని చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ముస్లింలు భారతీయులే అని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో రెండు దశల ఎన్నికలు ముగిశాయని, దాంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. దీంతో ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అబ్ కీ బార్ 400 కే పార్ అనే బీజేపీ స్లోగన్పై మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఎందుకు అడుగుతున్నారో ప్రజలు గుర్తించాలి అని అన్నారు. మోడీ, నడ్డా, అమిత్ షా అందరూ అదే స్లోగన్ ఇస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లను తీసేయాలనేది వారి ప్రణాళిక అని చెప్పారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, వాటిని తొలగించమని మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అంటే రిజర్వేషన్లను మీరు ఎత్తివేయాలనే విషయాన్ని ఎవరితోనో అని ఉంటారు. అది కాస్త వైరల్ అవడంతో ఇప్పుడు మాటలను వెనక్కి తీసుకున్నారు అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు.