»Divorced Daughter A Father Who Brings His Divorced Daughter Home With Mela Talas
Divorced Daughter: విడాకుల తీసుకున్న కూతుర్ని మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
ఎంతో ఘనంగా మేళతాళాలతో పెళ్లి చేసుకున్న కూతురు అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుంది. దీంతో ఓ తండ్రి మేళతాళాలతో ఎలా అత్తవారింటికి పంపించారో.. అదే మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చారు.
Divorced Daughter: A father who brings his divorced daughter home with mela talas
Divorced Daughter: సాధారణంగా పెళ్లికి మేళతాళాలు ఉంటాయి. ఎంతో ఘనంగా మేళతాళాలతో పెళ్లి చేసుకున్న అనివార్య కారణాల వల్ల కొందరు విడిపోతుంటారు. అయితే కాన్పూర్‌కు చెందిన ఓ మహిళ.. అత్తగారింట్లో వేధింపులు తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకుంది. కంప్యూటర్ ఇంజినీర్ అయిన అనిల్ కుమార్‌తో ఆమెకు 2016లో వివాహం జరిగింది. తండ్రి ఘనం కూతురు పెళ్లి చేశారు. అయితే కొన్న రోజులు బాగానే ఉంది. కానీ తర్వాత వరకట్నం కోసం ఆమెను అత్తవాళ్లు వేధించడం మొదలుపెట్టారు. మారుతారు ఏమో అని ఇన్నేళ్లు చూసింది.
एक साहसी पिता ऐसे भी…।
बेटी को ससुराल वालों ने प्रताड़ित किया। लाख कोशिश के बाद भी प्रताड़ना कम नहीं हुई। इसके बाद पिता ने जैसे गाजे बाजे के साथ बेटी को विदा किया था, वैसे ही धूमधाम से वापस ले आए। बेटी ने शादी के दौरान जो चुनरी पहनी थी उसे दरवाजे पर टांग दिया…। 1/2#kanpurpic.twitter.com/xqvzZV4270
కానీ ఇప్పటికీ మార్పు రాలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. అయితే తండ్రి ఆమెను అత్తవారింటి నుంచి బ్యాండ్ బాజాలు, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పెళ్లి చేసి కూతురిని అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తీసుకొచ్చామని తెలిపారు. విడాకులతో నా కూతురు, మనవరాలు నిరాశతో ఉండిపోకూడదని ఇలా చేశామని తెలిపారు. విడాకుల గురించి ఆలోచించి అదే ఆలోచనల్లో ఉండిపోకుండా సంతోషంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నా అని తండ్రి తెలిపారు.