»Megastar Chiranjeevi Shared A 22 Year Old Miracle On Mayday The Video Went Viral
Megastar Chiranjeevi: ‘మే డే’ రోజు 22 ఏళ్ల నాటి అద్భతాన్ని షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి. వీడియో వైరల్
మేడే రోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్టు షేర్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ఒ మంచి పనికోసం చేసిన ప్రకటన ఈ రోజుకు కూడా సరిపోతుందని దాన్ని షేర్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Megastar Chiranjeevi shared a 22-year-old miracle on Mayday. The video went viral
Megastar Chiranjeevi: మేడే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్మిక లోకానికి సోషల్ మీడియా వేదికగా మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్ట్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బాలకార్మికుల కోసం చేసిన యాడ్‌ను పంచుకున్నారు. ఆ వీడియోను జత చేస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) కోసం “చిన్ని చేతులు” అనే పేరుతో ఓ ప్రచార ప్రకటన చేసినట్లు.. ఈ రోజుకీ కూడా అది సందర్భోచితం అని షేర్ చేసినట్లు ఆయన పోస్టులో తెలిపారు. హ్యాపీ మేడే టు ఆల్ అంటూ ఇంటర్నేషనల్ లేబర్ డే, మే డే అనే హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ యాడ్ సారాంశం ఏంటంటే యజమానిరాలు తన పాపకు చదువు చెప్తుంటే, వాళ్ల పనిమనిషి తన పాపను ఆ ఇంట్లో బోళ్లు తొమడానికి తోడు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో వచ్చిన శబ్దానికి పాప చదువు డిస్టర్భ్ అవుతుందని యజమాని విసుగ్గుంటుంది. అలాంటి సమయంలో పనిమనిషి కూతురు తనలా అవకూడదని అనుకోని అంతా తలరాత అని సర్దుకుంటుంది. అదే సమయంలో చిరంజీవి మాటలు వినిపిస్తాయి. అలా తలరాత అంటే కాదు ముందు ఆ పాపకు చదువు చెప్పించు. అని అంటాడు. దాంతో పాప స్కూల్‌కు వెళ్తుంది.