RamCharan: RC 17.. అప్పటి నుంచే రంగంలోకి సుకుమార్?
రంగస్థలం కాంబినేషన్ రిపీట్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో సాలిడ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా కోసం.. అప్పటి నుంచే రంగంలోకి దిగనున్నాడట సుకుమార్.
RamCharan: పుష్ప2 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉండేది. కానీ.. మరోసారి రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. రామ్ చరణ్‌తో ఆర్సీ 17 అనౌన్స్ చేశాడు. ఇటీవలె ఆర్సీ 16ని శిష్యుడు బుచ్చిబాబుతో గ్రాండ్‌గా లాంచ్ చేశాడు చరణ్. ఆ తర్వాత గురువుతో ఆర్సీ 17ని అనౌన్స్ చేశాడు. ప్రజెంట్ గేమ్ చేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న చరణ్.. ఇది అయిపోగానే బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు. ఆ తర్వాత ఆర్సీ 17 సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో.. ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సుకుమార్. పుష్ప2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. ఆ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అవనున్నాడు సుక్కు. ఇక ఆ తర్వాత ఆర్సీ 17 కోసం రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు.
లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఆర్సీ 17 పై ఫుల్ ఫోకస్ చేయనున్నాడు సుకుమార్. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బుచ్చిబాబు అంతా రెడీ చేసుకొని చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి.. ఆర్సీ 16 అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యేలా ఉంది. ఆ తర్వాత వెంటనే ఆర్సీ 17 స్టార్ట్ కానుంది. ఈలోపు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు. రంగస్థలంలో చరణ్‌లోని అసలు సిసలైన నటుడ్ని బయటికి తీసిన సుకుమార్.. ఆర్సీ 17లో నట విశ్వరూపం చూపించడం పక్కా. మరి ఈసారి.. చరణ్, సుక్కు ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.