»Kalki 2898 Ad Did You Think It Was A Copy Due To Sand
Kalki 2898 AD: కల్కి 2898 AD.. ఇసుక వల్ల కాపీ అనుకున్నారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తునున్న కల్కి 2898ఏడి సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీగా తెరకెక్కుతుందనే టాక్ నడుస్తోంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ దీని పై క్లారిటీ ఇచ్చాడు.
Kalki 2898 AD.. Did you think it was a copy due to sand?
Kalki 2898 AD: ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ *కల్కి 2898 ఏడి* పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతం చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఊహకందని విధంగా సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌గా కల్కిని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ వారు ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. టాలీవుడ్ నుంచి వస్తున్న హాలీవుడ్ సినిమాగా కల్కి ఉంటుందనే మాట వినిపిస్తోంది. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాకు కాపీ అనే న్యూస్ వైరల్‌గా మారింది. రీసెంట్‌గానే ఈ సినిమాను వాయిదా వేస్తూ.. జూన్ 27న రానుందని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక్కడి నుంచి.. కల్కి హాలీవుడ్ మూవీ డ్యూన్ పోస్టర్ తరహలో ఉందనే టాక్ మొదలైంది.
దీని పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ వీఎఫ్ఎక్స్ మీట్లో.. కల్కి హాలీవుడ్ సినిమా ‘డ్యూన్’కి కాపీనా? అని అడగ్గా.. చాలా సింపుల్ ఆన్సర్ చేశాడు నాగి. ‘ఇసుక ఉండటం వల్ల మాత్రమే మీకు అలా అనిపిస్తుంది..’ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. దీంతో.. కల్కి ఏ సినిమాకు కాపీ కాదు.. ప్రేక్షకులకు నాగ్ అశ్విన్ మరో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడనే చెప్పాలి. అసలు.. కల్కి కాన్సెప్ట్ అర్థం కావడానికి సినిమా రిలీజ్‌కు ముందు యానిమేటేడ్ వీడియో రిలీజ్ చేస్తున్నాడంటే.. ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మహాభారతాన్ని టచ్ చేస్తూ.. దాదాపు 6000 సంవత్సరాల కాలం పాటు సాగే జర్నీనే కల్కి అని తెలుస్తోంది. కాబట్టి.. కల్కి సినిమా హాలీవుడ్ సినిమాలకు కాపీ అని చెప్పలేం. మరి కల్కి ఎలా ఉంటుందో తెలియాలంటే.. మరో రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే.