»Chandrababu We Will Set Up A Special Board For The Welfare Of Gang Workers
Chandrababu: ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం
మే డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినమే మే డే అని అన్నారు.
Chandrababu: We will set up a special board for the welfare of gang workers
Chandrababu: మే డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినమే మే డే అని అన్నారు. ఎంతో కష్టపడి సమాజ నిర్మాణానికి చేయూత అందించే శ్రామికుల హక్కులను కాపాడటంలో టీడీపీ ముందుంటుందన్నారు. 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌కు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం… మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు. తమ కష్టంతో ప్రగతి పూర్వక సమాజ నిర్మాణానికి చేయూతమిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో తెలుగుదేశం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా నిన్న విడుదల చేసిన…
వైసీపీ ప్రభుత్వం ఈ చేతితో సాయం చేసినట్లు చేసి ఇంకో చేతితో పదింతలు జరిమానాలతో తిరిగి లాగేసుకుంటుందని.. అలాంటి మాయలు మేం చేయమని చంద్రబాబు అన్నారు. జీవీ 21 రద్దు చేసి జరిమానాల భారం తగ్గిస్తాం. వాహనాలపై వైసీపీ ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించడానికి కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ గతంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి, ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.