VZM: కంటి చూపు సక్రమంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని రవాణా శాఖ ఉప కమిషనర్ డి. మణికుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా బుధవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ నేత్ర వైద్య శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు