MNCL: దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక సౌకర్యాలను జిల్లా కమిటీ సభ్యులు తనిఖీ నిర్వహించారు. గురువారం మండలంలోని కాసీపేట ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు నరసయ్య, ప్రధానోపాధ్యాయులు షరీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.