ASR: అరకులోయలో డ్రోన్ ద్వారా మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా కోసం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అరకు ప్రాంతీయ ఆసుపత్రి సమీపం నుంచి డ్రోన్ పరీక్షా ప్రయోగాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. డ్రోన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెడ్ వింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.