కర్నూలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం తెలిపారు. శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ 7993485111, డయల్ 100 వంటి సేవలపై శక్తి టీంలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.