KNR: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్ ఆమె అందజేశారు.