మనం తినే కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం మంచి కాదు. దీన్ని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రై చేసిన ఫుడ్‌ను తింటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో పొట్ట ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి అధికంగా తీసుకోకూడదు.